10, జూన్ 2014, మంగళవారం


కీడని యెంచకుండ రతి కేళికి నర్తనశాల లోపలన్ 
గూడగ నెంచి రమ్మనుచు గోరెను మించిన కామవాంఛతో
వేడెను కీచకుండు తన వేదన నంతయు వెళ్ళబుచ్చి య
ల్లాడెను, చేయి బట్టుకొని లాగెను, ద్రౌపది కౌగిలింతకై!

4 కామెంట్‌లు:

  1. తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండగా
    గొప్పగ జూడగా దలచి గుర్వుగ నీతులనెల్ల దెల్పుచున్
    జెప్పుచు మంచి మాటలను జీవన యానము బాగు పర్చగా
    దప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్!

    రిప్లయితొలగించండి
  2. అవనీ మండలమందు జనులన్యాయమ్ముగా బాధలన్
    చవిచూడంగ కవీశ్వరుండట దురాచారాల నాసాంతమున్
    కవనంబందున నెండగట్టుచును దుష్కార్యమ్ములన్ ద్రుంచి శో
    క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై!

    రిప్లయితొలగించండి
  3. వానల్ గాలులతోడ వచ్చునని విశ్వాసమ్ము గల్గించుచున్
    నానా వార్తలు చెప్పుచుందురయ ప్రాణాపాయమున్ దెల్పగా
    నేనాడైన నవాస్తవంబయినచో యీరీతిగా నందురే
    "యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యాకాశవాణిన్ జనుల్"

    రిప్లయితొలగించండి
  4. కీడని యెంచకుండ రతి కేళికి నర్తనశాల లోపలన్
    గూడగ నెంచి రమ్మనుచు గోరెను మించిన కామవాంఛతో
    వేడెను కీచకుండు తన వేదన నంతయు వెళ్ళబుచ్చి య
    ల్లాడెను, చేయి బట్టుకొని లాగెను, ద్రౌపది కౌగిలింతకై!

    రిప్లయితొలగించండి